కండోమ్ ఓపెన్ చేస్తూ ర‌కుల్ బోల్డ్ కామెంట్స్‌..ట్వీట్ వైర‌ల్‌!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. తాజాగా కండోమ్‌తో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తేజాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ర‌కుల్ ఈ మ‌ధ్య ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Image

రోనీ స్క్రూవాలా నిర్మాణంలో నిర్మితం కాబోతున్న ఈ మూవీకి `ఛత్రివాలి` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌లో ర‌కుల్ కండోమ్‌ను ఓపెన్ చేస్తూ క‌నిపిస్తోంది.

Image

ఇక త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఛత్రివాలి ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేసిన రకుల్ `ఎప్పుడైనా వర్షం రావచ్చు.. మీ గొడుగులు సిద్ధంగా ఉంచుకోండి` అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పుడామె ట్వీట్‌ తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఇంట్ర‌స్టింగ్ క‌థ‌తో రూపుదిద్దుకుంటోన్న‌ ఈ లేడి ఓరియెంటెడ్ మూవీలో ర‌కుల్ కండోమ్ టెస్టర్‌గా క‌నిపించ‌బోతోంది.