ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌..ఎవ‌రిపై అంటే?

ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్‌. ఎవ‌రిపై అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

RRR Movie Update NTR Ram Charan Starrer Entire Shoot Wrapped Up Finished  With Same Bike Shot

నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల బోతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

NTR30: When will it officially begin!

ఈ చిత్రం ప్రతీకార కథాంశంతో రూపుదిద్దుకోబోతోంద‌ట‌. ఇందులో ఎన్టీఆర్‌ పాత్ర సరికొత్తగా ఉంటుందని, ప్రతీకారం తీర్చుకునే వ్య‌క్తిగా ఆయ‌న క‌నిపించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. మాస్‌ అంశాలతో పాటు సామాజిక సందేశం మేళవించి కొర‌టాల శివ ఈ మూవీని తెరకెక్కించబోతున్నారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

ntr and koratala siva movie update: Heroines fix in NTR, Koratala movie ..  Do you only need to make an announcement? - bollywood heroine in ntr and koratala  siva movie latest update » Jsnewstimes

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.