బాల‌య్య‌-విజ‌య‌శాంతిల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ..?

November 24, 2021 at 9:15 am

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీ ఒక‌టి. దాదాపు 17 చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెర‌కెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జ‌త‌ క‌ట్టారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

Nandamuri Balakrishna at it again, slaps TDP activist | Amaravati News - Times of India

దాంతో ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, తల్లి దండ్రులు, రౌడీ ఇన్‌స్పెక్టర్, నిప్పురవ్వ చిత్రాల్లో క‌లిసి న‌టించ‌గా.. వీటిల్లో చాలా చిత్రాలే సూప‌ర్ హిట్‌గా నిలిచాయి.

Real Reason: Why Vijay Shanthi took BREAK from films? - TeluguBulletin.com

అయితే ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన బాల‌య్య‌, విజ‌య‌శాంతిలు కొన్నాళ్ల పాటు మాట్లాడుకోలేదు. అందుకు కార‌ణం వారిపై వ‌చ్చిన వార్త‌లే. నిజానికి బాల‌య్య అంటే విజ‌య‌శాంతికి ఎంతో అభిమానం. పైగా వ‌రుస సినిమాలు చేయ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య స్వచ్ఛమైన స్నేహబంధం ఏర్ప‌డింది. అయితే వీరిద్దరి స్నేహాన్ని చూసి ఓర్వ లేక‌పోయిన కొంద‌రు ప్ర‌ముఖులు.. వారిపై అస‌త్య ప్ర‌చారాలు చేశారు.

Kalyaana Ghadiya Full Video Song || Pattabhishekam Movie || Balakrishna, Vijayashanti - YouTube

దాంతో వీరు కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు. అలాగే బాల‌య్య‌, విజ‌య‌శాంతిల చివ‌రి చిత్రం నిప్పుర‌వ్వ‌. ఈ మూవీ త‌ర్వాత వీరిద్ద‌రి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఇద్దరు కలిసి నటించలేదని అప్పట్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. కానీ, విజ‌య‌శాంతి మాత్రం బాల‌య్య‌తో నాకు ఎటువంటి విభేదాలు లేవ‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బాల‌య్య‌-విజ‌య‌శాంతిల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts