`మ‌నం`లో బిగ్ ఆఫ‌ర్‌.. అనుష్క అందుకే వ‌దులుకుందా?

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, శ్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ 2014 మే 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Manam clocks 6 years: Akkineni Naga Chaitanya takes a trip down memory lane  | Telugu Movie News - Times of India

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే ఈ చిత్రంలో నాగార్జున‌కు జోడీగా శ్రియ స్థానంలో అనుష్క శెట్టిని తీసుకుందామ‌ని భావించారు. పైగా అనుష్క నాగార్జున న‌టించిన `సూప‌ర్` సినిమాతోనే సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత కూడా వీరిద్ద‌రూ ఎన్నో సినిమాలు చేశారు.

Nagarjuna And Anushka To Act Again Together

ఈ నేప‌థ్యంలోనే ఆమె ఖ‌చ్చితంగా మ‌నంకు ఒప్పుకుంటుంద‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ, అనుష్క మాత్రం మ‌నం నుంచి వ‌చ్చిన బిగ్ ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసింద‌ట‌. నాగ్ స్పెష‌ల్‌గా రిక్వ‌స్ట్ చేసినా నో చెప్పింద‌ట‌. ఆ సమయంలో ఇతర సినిమాలతో ఎంతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక అనుష్క `మనం` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పాత్రలో శ్రియ నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

How can I hide my wedding?': Anushka Shetty breaks silence on Prakash  Kovelamudi, calls Prabhas '3 am friend'

కాగా, అనుష్క విష‌యానికి వ‌స్తే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈమె ఇటీవ‌లె ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. పి.మహేష్‌బాబు దర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఏకకాలంలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.