ప‌వ‌న్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఎన్టీఆర్‌ను నిండా ముంచేసింది..తెలుసా?

November 24, 2021 at 8:01 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల‌ను తీసి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌.. అనేక సినిమాల‌నూ రిజెక్ట్ చేశారు. ఈయ‌న రిజెక్ట్ చేసిన చిత్రాల్లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

NTR 28: Pawan Kalyan to launch Jr NTR's next with Trivikram Srinivas -  Movies News

అటువంటి ఫ్లాప్ చిత్రాల్లో `కంత్రి` ఒక‌టి. అవును, కంత్రి చిత్రం మొద‌ట ప‌వ‌న్ వ‌ద్ద‌కే రాగా.. ఆయ‌న ప‌లు కార‌ణాల వ‌ల్ల రిజెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఈ సినిమాను ఎన్టీఆర్ టేక‌ప్ చేసి నిండి మునిగిపోయారు. మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌గా.. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర పోషించారు.

Watch Kantri on ott streaming online

భారీ అంచ‌నాల న‌డుమ 2008 మే 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డి.. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తన సినిమా ఎంపికలో చేస్తున్న పొరపాట్లను తెలుసుకొని అప్పటినుంచి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Jackal (Kantri) Telugu Full Movie | Jr NTR, Hansika, Tanisha | AR  Entertainments - YouTube

కాగా, ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` అనే పాన్ ఇండియా చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. ఈ చిత్రం పూర్తైన వెంట‌నే ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇప్ప‌టికే ఆధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

 

ప‌వ‌న్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం ఎన్టీఆర్‌ను నిండా ముంచేసింది..తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts