పుష్ప కోసం అది వదిలేశారు.. ఇక నేరుగా అటాకే!

November 23, 2021 at 9:40 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు.

కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్, హీరో ఇంట్రో టీజర్‌తో పాటు కొన్ని లిరికల్ సాంగ్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వాటన్నింటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్‌లు రావడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ రిలీజ్ కాలేదని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఇక రాదని తెలుస్తోంది.

దీనికి బలమైన కారణం కూడా ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే టీజర్‌ను రిలీజ్ చేయకుండా నేరుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందట.

అందుకే ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని, సినిమా రిలీజ్‌కు ముందే ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి టీజర్‌ను తప్పించి నేరుగా ట్రైలర్‌తో ప్రేక్షకులపై అటాక్ చేయనున్న పుష్పకు ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

పుష్ప కోసం అది వదిలేశారు.. ఇక నేరుగా అటాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts