`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

November 23, 2021 at 8:46 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

RRR: Naatu Naatu Song (TELUGU) NTR, Ram Charan | M M Keeravaani | SS  Rajamouli | Telugu Songs 2021 - YouTube

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. సినిమా నుంచి ఒక్కో అప్డేట్‌ను వ‌దులుతోంది. ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సెకెండ్ సింగిల్‌ను ఈ మ‌ధ్య విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

NTR Reveals The Hardwork For Naatu Naatu Step - mirchi9.com

‘నాటు.. నాలు..` అంటూ సాగే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్‌కి వీక్ష‌కుల నుంచి విశేష‌మైన ఆధ‌ర‌ణ ల‌భించింది. నవంబర్‌ 10న విడుదలై ఈ పాట ఇప్ప‌టికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే కొన‌సాగుతోంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌, చెర్రీలు క‌లిసి వేసిన స్టెప్ అదిరిపోయింద‌నే చెప్పాలి. అయితే ఆ స్టెప్ కోసం వారింద‌రినీ రాజ‌మౌళి ఎంతో క‌ష్ట‌పెట్టాడ‌ట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా చెప్పుకొచ్చారు.

RRR Naatu Naatu is a Fast Beat Foot Tapping Number

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. `నాటు నాటు పాటలో కాళ్ళను ఎడమ కుడి వైపుకు.. అలాగే ముందుకు వెనక్కి తిప్పే స్టెప్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ రావడానికి దాదాపు15 నుంచి 18 టేక్స్ తీసుకున్నాం. ఈ పాటలో సింక్ కనిపించట్లేదని రాజమౌళి మా ఇద్దరికీ న‌ర‌కం చూపించాడు. స్టెప్ రికార్డ్ చేస్తూ.. `కాళ్లేంటి అలా కదుపుతున్నారు.. చేతులు అలాగేనా తిప్పేది.. ముందుకు వెళ్ళండి వెనక్కి ఉండండి` అని ఏదొకటి అంటూనే ఉండేవారు. ఇక ఆ చిన్న స్టెప్ కోసమే మాకు ఒక రోజంతా టైం పట్టింది` అని చెప్పుకొచ్చారు.

 

`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts