బిగ్‌బాస్ 5: 12వ‌ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?

November 23, 2021 at 8:07 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌న్నెండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, ఆనీ మాస్ట‌ర్‌లు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 5 Telugu: Any Master Elimination Effect .. Excited Shriram  Chandra .. Sunny by Counter .. | Bigg boss 5 telugu 23rd november 2021  episode updates sriram fires on kajal | pipanews.com

ఇక 12వ వారం మాన‌స్ మిన‌హా.. యాంక‌ర్ ర‌వి, స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు శ్రీ‌రామ్‌లు నామినేట్ అయ్యారు. అయితే వీరిలో శ్రీ‌రామ్‌, స‌న్నీ, ష‌ణ్ముఖ్ ఈ ముగ్గురు ప్ర‌తి వారం లాగానే ఈ వారం కూడా టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు. అలాగే యాంక‌ర్ ర‌వికి భారీ ఫాలోయింగ్ ఉండ‌టం వ‌ల్ల ఈయ‌న ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు.

Bigg Boss Telugu Season 5 Voting: Who are nominated for 7th Week  elimination vote? - Daily Research Table

ఇక కాజ‌ల్‌, సిరిలు సైతం హౌస్‌లో బాగానే రాణిస్తున్నారు. బ‌య‌ట‌ ఫాలోయింగ్ సైతం మంచిగానే ఉండ‌టంతో.. వీరిద్ద‌రూ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. మిగిలింది ప్రియాంక‌నే. ఈమె హౌస్‌లో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ గేమ్‌పై కంటే మాన‌స్‌పైనే ఇంట్ర‌స్ట్ పెట్టింది. త‌ర‌చూ అత‌డి చుట్టూ తిర‌గ‌డం త‌ప్పితే.. ఆమె గేమ్ ఆడిన సంద‌ర్భాలు చాలా తక్కువ‌.

Bigg Boss 5 Telugu: Priyanka Singh on the edge

ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో వీక్ కంటెస్టెంట్ కూడా ప్రియాంక‌నే. ఈ నేప‌థ్యంలోనే 12వ వారం ప్రియాంక ఎలిమినేట్ అవ్వ‌డం ప‌క్కా అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

బిగ్‌బాస్ 5: 12వ‌ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts