గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

November 23, 2021 at 7:27 pm

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

Pooja Hegde celebrates 15 million followers on Instagram, introduces her  team - Movies News

ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే.. తాజాగా త‌న అభిమానుల‌కు ఓ గుడ్‌న్యూస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది. `లెజెండ్‌ అమితాబ్‌ గారితో కలిసి పని చేయాలి, షూటింగ్‌లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కల. ఇవాళ నా కలల లిస్ట్‌లో అది టిక్‌ పెట్టేసుకోవచ్చు.

Pooja Hegde teases new project with Amitabh Bachchan; shares candid picture  | Celebrities News – India TV

ఎందుకంటే నేను అమితాబ్‌ గారితో కలిసి వర్క్‌ చేశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఇప్పటికే ఎక్కువ వివరాలు చెప్పేశాను. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి` అని ఎంతో ఆనందంగా పేర్కొంటూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో దిగిన ఓ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది. మ‌రి పూజా హెగ్డే.. అమితాబ్‌తో క‌లిసి ఏదైనా యాడ్‌లో న‌టించిందా..? లేక ఆయ‌న సినిమాలో ఆఫ‌ర్ కొట్టేసిందో..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Pooja Hegde Ticks Dream Off Her Bucket List, Shoots With 'legend' Amitabh  Bachchan

కాగా, పూజా హెగ్డే సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆమె ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించిన `రాధేశ్యామ్‌` చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ రిలీజ్‌ కానుంది. అలాగే చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన `ఆచార్య‌` చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించిన పూజా.. త‌మిళంలో విజ‌య్ ద‌ళ‌ప‌తితో `బీస్ట్‌` చిత్రంతో న‌టిస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ ప‌లు ప్రాజెక్ట్స్‌కి సైన్ చేసింది.

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts