ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజ‌న్లు ఫైర్‌..ఏమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు.

Image

అలాగే ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. నేడు సెకండ్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌బోతోంది.

 గతంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ టీజర్‌ను విడుదల చేసినపుడు తారక్.. తలపై ముస్లిమ్ టోపీ పెట్టుకోవడంపై కొమరం భీమ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఒకవేళ థియేటర్స్‌లో అలానే చూపిస్తే తెరలు చినిగిపోతాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. (Twitter/Photo)

`నా పాట సూడు .. నా పాట సూడు .. నాటు .. నాటు .. నాటు .. వీరనాటు` అంటూ సాగే ఈ సాంగ్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు మాస్ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ విష‌య‌మే కొంద‌రికి న‌చ్చ‌డం లేదు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులతో చేయకూడని డాన్సులు చేయిస్తూ.. ఈ సినిమాలో చారిత్రక వీరులను అవమానిస్తున్నారంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. మ‌రోవైపు ఇది క‌ల్పిత క‌థ అని, సినిమా వర్కౌట్ కావాలంటే ఫిక్షన్‌తో పాటు డాన్సులు కూడా అవ‌స‌ర‌మ‌ని కొంద‌రు వాధిస్తున్నారు.