జగన్..విజయసాయి..మధ్యలో ఆదిత్య

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మామూలే. అయితే అందుకు భిన్నంగా వైసీపీలో జరుగుతోంది. నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకపోయినా లోలోపల మాత్రం ఎత్తులు..పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగనే ముందున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదీ డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్టుగా ఆయనను సైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడం. అదీ దేశ రాజధాని ఢిల్లీలో. ఆయనను సలహాదారుగా నియమిస్తే ఈయనుకు వచ్చిన ఇబ్బందేమనే సందేహాలు కూడా వస్తాయి.

అక్కడే ఉంది తిరకాసు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విజయాసాయి రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడి ఎన్నికైన అనంతరం ఢిల్లీలో పార్టీకి అన్నీ తానై చూసుకుంటున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర పెద్దలను నిత్యం కలుస్తూనే ఉంటాడు. బీజేపీ సీనియర్ నాయకులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటాడు. ప్రధాని మోదీకి కూడా విజయసాయిని పేరుపెట్టి పిలిచేంత దగ్గరయ్యాడు. ఈ వ్యవహారాల వల్లే పార్టీలో ఆయన నెంబర్ 2 అనే పేరు తెచ్చుకున్నాడు. అదే ఇపుడు విజయసాయికి మైనస్ అయింది అని చెప్పవచ్చు. ఢిల్లీలో ఏ పని కావాలన్నా విజయసాయి మీదే ఎందుకు ఆధారపడాలి అనే ఆలోచన వచ్చినట్లుంది జగన్ కు. అందుకే ఆదిత్యనాథ్ దాస్ రూపంలో విజయసాయిని సైడ్ చేయనున్నాడు. ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలో నియమించడంతో ఇక కేంద్రం, రాష్ట్రం మధ్య జరిగే అధికారిక కార్యక్రమాలన్నీ ఆదిత్య కనుసన్నల్లోనే జరుగుతాయి. అంటే విజయసాయి చేసే పనులు అధికారికంగా ఆదిత్య నిర్వహిస్తారు.