వీధికెక్కిన సంజన జగడం..?

నటి సంజన తాజాగా ఒక ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ సంజన పై రాజరాజేశ్వరీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. అసలేం జరిగిందంటే.. అంజనా సూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. ఏసీ వేయాలనే ఆమె డ్రైవర్ కు సూచించారు. ఇక డ్రైవర్ ఏసీ వేసి లోగా అంజన తిట్ల పురాణాన్ని మొదలు పెట్టింది. అక్కడికక్కడ తను క్యాబ్ డ్రైవర్ అపహరించాడని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తనను ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ డ్రైవర్ ను బెదిరించింది. అతను మీరు బుక్ చేసిన లొకేషన్ కి వెళ్తున్నాము అని చెప్పినా వినకుండా అతనిని తిడుతూనే ఉంది.

అంతేకాకుండా లొకేషన్ కు రీచ్ అయిన తరువాత నా భర్త వస్తాడని నీ అంత చూస్తాడు అంటూ బెదిరించింది. అక్కడ జరిగిన దాని మొత్తం డ్రైవర్ సెల్ ఫోన్ లో రికార్డు చేసి పోలీసులకు వివరించాడు. మొదట ఏసీ వేయమన్న అప్పుడు అతను మొరటుగా సమాధానం ఇచ్చాడని తప్పు పట్టింది, అలాగే తాను చెప్పిన చోటికి తీసుకు వెళ్లినందుకు మీ తలపై రెట్టింపు ఇవ్వాలని కోరడంతో తన పది వేలు ఇవ్వడం సాధ్యమా? మీ అక్క చెల్లెలను ఇలాగే అడుగుతావా అని ప్రశ్నించడమే తప్పయిందని చెప్పారు. మొదట అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన తాను మరొకసారి పోలీసులకు ఫోన్ చేసి డ్రైవర్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. డ్రైవర్లు కార్మికులను గౌరవంగా చూస్తానని, దీంతో అతడు అమర్యాదగా ప్రవర్తించిన క్షమించాను అని ఆమె ట్వీట్ చేసింది.