చరణ్, శంకర్ మూవీ : ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్.. ఏంటంటే ..!

ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాగా దర్శక దిగ్గజం శంకర్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవం ఇదివరకే జరిగిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. మొదటగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు. ఇందుకుగాను పుణేలో ఒక భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది.ఇక్కడే కొద్ది రోజుల పాటు షూటింగ్ జరగనుంది.

కాగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా నటించనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఇదివరకు నాయక్ మూవీలో ఒకసారి డ్యూయల్ రోల్ లో కనిపించారు. అయితే తండ్రీ కొడుకులుగా నటించడం ఇదే మొదటి సారి.

శంకర్ సినిమాలో ఏదైనా ఒక గెటప్ అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చూస్తే ఇది అర్థమవుతుంది. అలాగే అపరిచితుడులో విక్రమ్ మూడు గెటప్పుల్లో ఎంతో వైవిధ్యంగా కనిపించాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో కూడా చరణ్ తండ్రి కొడుకుల గెటప్ లు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే చరణ్ మీసకట్టు కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి.