ఆ ఫ్యామిలీతో తన మొదటి షో ప్రారంభిస్తున్న బాలకృష్ణ..!

October 7, 2021 at 3:37 pm

నరసింహ బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుండి వెండితెరపై అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలో తెలుగు షోకి హోస్ట్ గా చేయడానికి సిద్ధమ అయ్యాడు. ఇక ఈ ప్రదర్శనకు”ఆపలేని”టైటిల్ పెట్టినట్లు సమాచారం.

బాలకృష్ణ హోస్ట్ గా చేయడం ఇదే మొదటిసారి. ఇక దీంతో బాలకృష్ణ లో కొత్త పాత్ర ని చూడవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇందుకుగాను మొదటి షో కి గెస్ట్ గా ఎవరు వస్తారు అనేదానిమీద ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.

తాజా సమాచారం ప్రకారం మొదటి షోకి అతిథులుగా మోహన్ బాబు మరియు అతని కుటుంబం తో కలిసి ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నట్లు సమాచారం. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ అసోసియేషన్ కి సపోర్టు కూడా బాలకృష్ణ ఇవ్వడం విశేషం. ఇక ఆహ ఓటీటీ సంస్థ ఈ సో ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మరి వేచిచూడాల్సిందే బాలకృష్ణ ఈ షో కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం.

ఆ ఫ్యామిలీతో తన మొదటి షో ప్రారంభిస్తున్న బాలకృష్ణ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts