`మిస్టర్ ప్రేమికుడు`గా రాబోతున్న ప్రభుదేవా..స‌క్సెస్ అవుతాడా?

October 21, 2021 at 11:28 am

న‌టుడిగా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, ద‌ర్శ‌కుడిగా తెలుగు, త‌మిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా న‌టించిన తాజా చిత్రం `చార్లీ చాప్లిన్ 2`. శక్తి చిదంబరం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదా శర్మ, నిక్కి గల్రాని హీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ‌నాట 2019లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

Prabhu Deva all set to marry for the second time: reports

అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి `మిస్టర్‌ ప్రేమికుడు` పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. రిలీజ్ డేట్‌ను కూడా ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామ‌ని నిర్మాతలు వి.శ్రీనివాసరావు, గుర్రం మహేష్‌ చౌదరి తాజాగా వెల్ల‌డించారు.

Prabhu Deva's new avatar

కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ట‌. మ‌రి మిస్ట‌ర్ ప్రేమికుడుగా రాబోతున్న ప్ర‌భుదేవా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాల్సి ఉంది.

`మిస్టర్ ప్రేమికుడు`గా రాబోతున్న ప్రభుదేవా..స‌క్సెస్ అవుతాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts