తెలుగులో కే3: కోటికొక్కడు సినిమా రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

సుదీప్ ఈ పేరు వినగానే చాలామంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ఈగ ఫేమ్ సుధీర్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇక సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం కే3: కోటికొక్కడు. ఈ సినిమాకు శివ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఇందులో మడోన్నా సెబాస్టియన్, సర్దార్ హీరోయిన్ లుగా నటించారు. కన్నడలో కే3 పేరుతో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో కే3: కోటికొక్కడు అనే టైటిల్ తో ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది.

స్పందన పాశం, జీవితం రెడ్డి సమర్పణలో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీజే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. కన్నడాలో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంతేకాకుండా సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్ మూవీ లవర్స్ ను ఖచ్చితంగా అలరిస్తుంది అని నిర్మాతలు తెలిపారు.