ఐదు మంది హీరోయిన్లు ఒకే సారి స్టేజ్ పై.. ప్లాన్ అదిరిపోయింది..?

October 21, 2021 at 11:16 am

దీపావళి పండుగ సందర్భంగా ఈటీవీ వాళ్ళు ఒక బిగ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ వేడుకకు సంబంధించిన ఒక ప్రోమో ఇటీవల విడుదలయ్యింది. ఈ ప్రోమో కాస్త బాగా వైరల్ గా మారుతుంది. ఈ ప్రోమో కి యాంకర్ గా ప్రదీప్ ఉన్నారు.

ఈ స్టేజి మీదికి ఐదు మంది హీరోయిన్లు నవ్వుతూ వస్తే ఎలా ఉంటుంది, అంతేకాకుండా వారు అందరూ ఒకేసారి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ భారీ రేంజ్లో ఇంట్రడక్షన్ అని తెలియజేశాడు ప్రదీప్. ఇక ఆ తర్వాత రోజా, ప్రియమణి, ఇంద్రజ, పూర్ణా తో సహా మరో హీరోయిన్ కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

ఇక ఒకే సారి ఐదు మంది హీరోయిన్లు స్టేజ్ మీద డాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ సారి దీపావళికి మంచి కలర్ ఫుల్ ప్లానింగ్ ను చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈవెంట్కు తగ్గేదే లేదు అని ఒక పేరు పెట్టారు.

ఐదు మంది హీరోయిన్లు ఒకే సారి స్టేజ్ పై.. ప్లాన్ అదిరిపోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts