ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం `సమ్మతమే` ఫస్ట్‌ గ్లింప్స్..!!

October 21, 2021 at 11:56 am

`రాజావారు రాణిగారు` సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి `ఎస్ఆర్ కల్యాణమండపం`తో హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజా చిత్రం `స‌మ్మ‌త‌మే`. గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

First Look: Kiran Abbavaram Sammathame | Manacinema

మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ ఫుల్ మోడ్రన్ గర్ల్‌లా క‌నిపించింది. అలాగే పాటల ద్వారా ఎదుటివారి ఫీలింగ్స్‌ను బయటపెట్టడం ఆక‌ట్టుకుంటోంది.

Sammathame first glimpse: Kiran Abbavaram and Chandini Chowdary sweep you off your feet

కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఈ సారి విభిన్నమైన ప్రేమ కథతో ముందుకు వచ్చారని ఫస్ట్ గ్లిమ్స్ తోనే అర్థం అవుతోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ గ్లింప్స్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం `సమ్మతమే` ఫస్ట్‌ గ్లింప్స్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts