`స్పిరిట్`గా వ‌స్తున్న‌ ప్రభాస్..డైరెక్ట‌ర్ అత‌డే!

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. అంద‌రూ ఊహించిన‌ట్టే ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశామ‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Prabhas announces 25th film Spirit, to be directed by Sandeep Reddy Vanga - Movies News

ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపుద్దికోబోతోంది. ఈ చిత్రం కి సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Image

కాగా, ఈ మ‌ధ్యే రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్ర‌భాస్.. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్-కె చిత్రాలు చేస్తున్నాడు. ఈ చిత్రాలు పూర్తి అయిన త‌ర్వాతే స్పిరిట్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ లోపుగా సందీప్ రెడ్డి బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ తో `యానిమల్‌` అనే మూవీని చేయ‌నున్నాడ‌ట‌.

Image