విడాకుల తర్వాత తొలిసారి షూటింగ్ కి.. ఎమోషనల్ అయిన సమంత..!

కొన్ని నెలలుగా దూరం దూరం ఉంటూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి పెద్ద బాంబే పేల్చారు సమంత, నాగ చైతన్య. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత డైవోర్స్ ప్రకటించిన తర్వాత వైరాగ్యంగా మెసేజ్ లు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కొద్దిరోజుల నుంచి ముంబై ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ సమంతతో ఒక యాడ్ తీస్తున్నారు. ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తికాకముందే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

అయితే షెడ్యూల్ ప్రకారం సమంత యాడ్ షూటింగ్ కి రావాల్సి ఉంది. ఆమె రాదేమోనని అంతా భావించగా నిన్న యాడ్ షూటింగ్ జరిగే స్పాట్ కి సమంత వచ్చింది. ఈ షూటింగ్ జరుగుతుండగా బ్రేక్ సమయంలో ఆమె ఎమోషనల్ అయినట్లు సమాచారం. విడాకుల విషయమై కన్నీరు సమంత పెట్టుకున్న ట్లు తెలిసింది.

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత.. సమంత పైనే నెటిజన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమాల్లో శృతి నుంచి ఎక్స్ పోజింగ్ చేయడం,తన వ్యక్తిగత ఫ్యాషన్ డిజైనర్ తో సన్నిహితంగా మెలగడం పై విమర్శలు చేస్తూ మెసేజ్ లు పెడుతున్నారు. వీటిపై సమంత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే షూటింగ్ స్పాట్ లో సమంత కంట కన్నీరు పెట్టుకుందని తెలిసింది. కాగా ఈ సిచ్యువేషన్ లో కూడా సమంత షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా హాజరవడంపై ఆమె అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. దీంతో పాటు పలు భాషల్లో ఆమె సినిమాలు చేస్తోంది.