సీనియ‌ర్ న‌టుడు కైకాల‌కు అస్వస్థత..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయ‌న్ను కుటుంబ‌స‌భ్యులు హుఠాహుఠిన‌ శనివారం రాత్రి హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

HBD Kaikala Satyanarayana: Sweet Feeling .. Chiru Emotional

నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కార‌ణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివ‌రించారు.

Actor Kaikala Satyanarayana felicitated by TSR Foundation | Indian Celebrity Events

కాగా, గత 60 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగంలో ఉన్న ఆయన 700 పైగా సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. అలాగే పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రధాన భూమికలు పోషించారు. ఇక తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు.

Kaikala Satyanarayana rare photo gallery - Sakshi