`రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖ‌రారు..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. పీరియాడిక‌ల్ ప్రేమ క‌థగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుద‌ల కాబోతోంది.

Prabhas 20 titled 'Radhe Shyam', first look with Pooja out

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదిరిపోయే టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌.. దీపావ‌ళి కానుక‌గా మ‌రో టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఇక మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏంటంటే.. రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్‌కి కూడా ముహూర్తం ఖ‌రారు అయింద‌ట‌.

Prabhas, Pooja Hegde gift fans new Radhe Shyam poster on Janmashtami - Movies News

తాజా స‌మాచారం ప్ర‌కారం.. నవంబర్ మూడవ వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ వెర్షన్స్‌కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించ‌గా.. మిథున్, మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్‌కి మ్యూజిక్ కంపోజ్ చేశారు.