కోటాకి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన అన‌సూయ‌..నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ అనసూయ వస్త్రాధారణపై సీనియర్ నటుడు, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోటా వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ స్పందిస్తూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. కోట శ్రీనివాస‌రావు పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న తీరుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Anasuya Bharadwaj Creates Magic With Her New Look - ManaTeluguMovies.net

`రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నా వ‌స్త్రాధార‌ణ‌పై కొన్ని కామెంట్స్ చేశార‌ని తెలిసింది.ఎంతో అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా మాట్లాడ‌టం నాకు చాలా బాధ‌ను క‌లిగించింది. అస‌లు ఎలాంటి దుస్తులు ధరించాలనేది ఒక వ్యక్తి వ్యక్తిగత విషయం. అది వృత్తిపరమైన ఎంపిక కూడా అయ్యుండొచ్చు. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా ఇటువంటి వార్త‌ల‌ను సోష‌ల్ మీడియా ఎందుకు హైలైట్‌ చేస్తుందో అర్థం కావడం లేదు. ఆల్కహాల్‌ తీసుకునే సన్నివేశాలు, అద్వాన్నమైన దుస్తులు ధరిస్తూ, మహిళలను అవమానపరిచే సన్నివేశాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఆ సీనియర్ నటుడుని ఎందుకు ప్రశ్నించలేరు` అంటూ అన‌సూయ మండిప‌డింది.

Kota Srinivasa Rao makes sensational comments on Telugu heroes - TeluguBulletin.com

అక్క‌డితో ఆగ‌లేదు..`ఎవ‌రైతే పెళ్లి చేసుకున్నారో, పిల్ల‌ల‌ను క‌లిగి ఉన్నారో, సిల్వ‌ర్ స్క్రీన్‌పై న‌టీమ‌ణుల‌తో రొమాన్స్ చేస్తున్నారో, ష‌ర్టులు వేసుకోండా త‌న దేహాన్ని చూపించే తార‌ల‌నెందుకు ప్ర‌శ్నించ‌రు. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న నా లాంటి మహిళ జీవితంలో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేస్తూ.. పురుషాధిపాత్యాన్ని ప్రశ్నిస్తుంటే మిమ్మల్ని భయపెడుతున్నట్లా.. ఒకవేళ అదే అనుకుంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలను అందరు ముందు చెప్పేకంటే, మీ పని మీరు చేసుకోండి’ అంటూ అన‌సూయ ట్వీట్ చేసింది. దాంతో ఆమె ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/anusuyakhasba/status/1450070501171154946?s=20