బిగ్‌బాస్ 5: ర‌వి అలాంటి వాడే..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన అలీ రెజా..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. ఇంకా 13 మంది హౌస్‌లో కొన‌సాగుతున్నారు. అయితే వీరిలో ఒక‌డైన యాంక‌ర్‌ ర‌విపై ఈ మ‌ధ్య నెగ‌టివిటీ బాగా పెరిగిపోయింది.

Bigg Boss 5 Telugu: Anchor Ravi per week remuneration

ప్రియ-లహరి ఎపిసోడ్‌ తర్వాత ర‌విని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. అలాగే శ్వేతా ఎలిమినేట్ అవుతూ.. అస‌లు ర‌విని న‌మ్మొద్దంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. మ‌రోవైపు నాగార్జున కూడా ర‌విని గుంట న‌క్క అని అనేశారు. దాంతో నెటిజ‌న్లు ర‌విని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. చేసిన తప్పులు ఒప్పుకోడ‌ని, తాను హౌస్‌లో కొన‌సాగేందుకు ఇత‌రుల‌ను బ‌లి చేస్తాడ‌ని ర‌విపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

This heartwarming throwback video of Ravi talking about Ali Reza leaves the latter emotional; says, "Arey salay ur the friend everyone should have" - Times of India

అయితే ఇలాంటి త‌రుణంలో రంగంలోకి దిగిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌, న‌టుడు అలీ రెజా ర‌విపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ అత‌డి గుట్టంతా బ‌య‌ట‌పెట్టారు. అలీ రెజా మాట్లాడుతూ..`ఎవరితోనైనా గొడవలు వస్తే దానిని వెంట‌నే పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడు. కానీ, దానిని కొందరు అపార్థం చేసుకుంటున్నారు. రవి తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, అత‌డు ఎంతో మంచివాడు, కాబట్టి షో చూసి అత‌డిని జడ్జ్ చేయ‌ను` అంటూ చెప్పుకొచ్చారు. ఇక అలీ రెజా వ్యాఖ్య‌ల‌తో ర‌విపై కాస్త పాజిటివ్ కార్న‌ర్ ఏర్ప‌డింది.