మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన స‌మంత‌..అదృష్టమంటే ఇదే..?!

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత స‌మంత కెరీర్ ప‌రంగా ఫుల్ జోష్ చూపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఆమెకు అదృష్టం కూడా బాగానే క‌లిసొస్తోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామ్‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే ఇటీవ‌ల మ‌రో రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది.

Did Samantha reject Shah Rukh Khan's Lion for this personal reason? - Tamil News - IndiaGlitz.com

వాటిల్లో ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. మ‌రో సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్సే తెర‌కెక్కించ‌నున్నారు. అయితే తాజాగా సామ్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ ఆఫ‌ర‌ట‌.

Did Samantha reject Shah Rukh Khan's Lion because she was planning a baby? - Movies News

బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్‌, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రానికి `లయన్` అనే టైటిల్ దాదాపు ఖ‌రారు కాగా.. ఇందులో హీరోయిన్‌గా మొద‌ట న‌య‌న‌తార‌ను అనుకున్నార‌ట‌. కానీ, చివ‌ర‌కు స‌మంత‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ చిత్రానికి గానూ సామ్ ఏకంగా రూ.7 కోట్లను రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటుంద‌ని టాక్‌. మ‌రి ఈ ప్ర‌చారం నిజ‌మైతే.. సామ్ తొలి బాలీవుడ్ సినిమా ఇదే అవుతుంది.