విశాల్ యాక్షన్ సినిమా టైటిల్ టీజర్ విడుదల..?

October 19, 2021 at 11:22 am

హీరో విశాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. ఇప్పుడు వినోద్ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా టైటిల్ ను తెలియజేయడం జరిగింది. అదేమిటంటే”లాఠీ.”ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ విషయానికి వస్తే.. టెర్రస్ పైన వేలాడతీసిన ఒక చొక్కా పోలీస్ యూనిఫాం లా మారడం, ఒక మామూలు కర్ర లాఠీల రూపాంతరం చెందడం వంటివి టీజర్ సన్నివేశాలలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో హీరో విశాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్ర పేరు మురళీకృష్ణ అనే విషయాన్ని కూడా తెలియజేశారు.

యాక్షన్ సిల్వర్ ప్రాధాన్యత ఇస్తున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ లో దాదాపు 45 నిమిషాల పాటు భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లుగా సమాచారం. విశాల్ కు జోడిగా సునైనా నటిస్తోంది.

విశాల్ యాక్షన్ సినిమా టైటిల్ టీజర్ విడుదల..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts