విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్‌.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!

October 13, 2021 at 11:58 am

అక్కినేని నాగార్జున‌ వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాలు చేసినా.. హిట్ మాత్రం అందుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది.

Most Eligible Bachelor Trailer: Pooja Hegde & Akhil Akkineni on a quest to find a right partner for marriage | PINKVILLA

భారీ అంచ‌నాల న‌డుమ‌ ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అఖిల్‌.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. అలాగే క్రీడల బయోపిక్ చిత్రాలపై తనకు ఆసక్తి ఎక్కువని తెలిపిన అఖిల్‌.. టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాల‌నుంద‌ని త‌న మ‌న‌సులో ఉన్న సీక్రెట్‌ను ఓపెన్‌గానే రివిల్ చేశాడు.

Akhil Akkineni to play Virat Kohli on screen ?

విరాట్ కోహ్లీ జీవితాన్ని బ‌యోపిక్ తీస్తే వెండి తెరపై తిరుగులేని కథ అవుతుంద‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు. కాగా, అఖిల్ న‌టుడే కాదు.. మంచి క్రికెట‌ర్ కూడా. క్రికెట్ లో అఖిల్ కు మంచి ప్రావీణ్యం ఉంది. ఒక దశలో నటుడిగా కాకుండా క్రికెటర్ కావాలని అఖిల్ కలలు కన్నాడు. కానీ, చివ‌రకు త‌న మ‌న‌సు మార్చుకుని యాక్ట‌ర్‌గా సెటిల్ అయ్యాడీయ‌న‌.

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అఖిల్‌.. సీక్రెట్ రివిల్ చేసిన అక్కినేని హీరో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts