బిగ్‌బాస్‌-5: ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై అప్పుడే వారం కావొస్తోంది. యాంకర్ రవి, హమీద, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, మానస్, సరయులు నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఫ‌స్ట్ వీకే ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రు అన్న ఉత్కంఠ అంద‌రిలోనూ మొద‌లైంది.

Bigg Boss Telugu Vote Season 5 Online Voting | Bigg Boss 5 Telugu Voting Poll Results

అయితే ప‌లు పోలింగ్స్ ప్ర‌కారం.. తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మోడల్ జశ్వంత్ అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈయన మొదట్లో చాలా సైలెంట్ గా ఉన్న‌ప్ప‌టికీ.. క్ర‌మ‌క్ర‌మంగా అవసరం ఉన్నా లేకపోయినా ఆవేశపడుతూ ఆదిలోనే అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు.

Jaswanth Padala (Bigg Boss Jessie) Wiki, Biography, Age, Movies, Images - News Bugz

ఎప్పుడూ సిరి జపం చేసే జెస్సీ ఆమెతో తప్ప మిగతావాళ్లతో పెద్దగా కలవట్లేదు. గేమ్‌లోనూ చురుకుగా పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు. పైగా హ‌మీదాతో పిల్లి వివాదం, యానీ మాస్టర్‌తో కుర్చీ వివాదం కూడా అతడికి మైనస్‌లుగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు చాలా త‌క్కువ ఓటింగ్ వ‌చ్చింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. దాంతో జెస్సీనే ఫ‌స్ట్ ఎలిమినేట్ అవుతాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.