టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ బిజినెస్ విషయంలో కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి కూడా పెట్టాడు.అయితే ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు.
అది ఏమిటంటే త్వరలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో కొనబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీవీ ఛానల్ యజమానితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.ఆ చానల్ పాపులర్ ఛానల్ కూడా కాదని ఇంతవరకు అది అభివృద్ధి కాలేదని.. అందుచేతనే ఆ ఛానల్ ని బాగా పాపులర్ చేసేందుకే చెర్రీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చానల్ ను రామ్ చరణ్ తీసుకోవడానికి ముఖ్య కారణం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసమే రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.తన బాబాయ్ కు ఒక సొంత ఛానల్ ఉండే విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అంతే కాకుండా వీటితోపాటు మరొక రెండు చానెళ్లను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.