తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో మూడో వారం కొనసాగుతోంది. ఇంటి సభ్యులందరూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, హౌస్‌లో నిలదొక్కుకునేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్, సిరిలపై ఫస్ట్ వీక్ నుంచీ నెగిటివిటీ నెలకొంది.
ఇద్దరూ కలిసి ఆడుతున్నారని ఇంటి సభ్యులు వాధిస్తున్నారు. కెప్టెన్ టాస్క్‌లో ఆమెకే సపోర్ట్ చేయడం, సన్నీ విషయంలో సిరికి వంతపాడటం.. ఇవన్నీ షణ్నును బ్యాడ్ చేశాయి. మరోవైపు ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవిలు సైతం సిరితో ఉంటే నీకు కష్టమే అని షణ్నుకు చురకలు వేశారు. దాంతో కళ్లుతెరిచిన షణ్ముఖ్.. తాజా ఎపిసోడ్‌లో సిరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జెస్సీతో మాట్లాడుతూ..`నాకు ఎక్కడో కొడుతుంది.. వరుస ఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది. అందుకే బెడ్ మారిపోదాం.. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది.. ఎందుకో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు నచ్చడం లేదు. వెరీ బ్యాడ్.. నేను సిరి నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేశా. ఆమె నుంచి ఎక్స్ పెక్ట్ చేయడం నాదే తప్పు’ అంటూ షణ్ముఖ్ ఓపెన్ అయ్యాడు. ఇక షణ్ను నిర్ణయంతో సిరి పని గోవిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.