ఇంట్ర‌స్టింగ్‌గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజ‌ర్‌..చిరు ప్ర‌శంస‌లు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్‌`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

Clap Poster: Aadhi On Track, Ready To Run - Aadhi Pinisetty Clap

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే క్లాప్ టీజ‌ర్‌ను చిరంజీవి చేతుల మీద‌గా విడుద‌ల చేయించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా టీజ‌ర్‌పై మ‌రియు ఆది పినిశెట్టి న‌ట‌న‌తో చిరు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. `నా పేరు విష్ణు.. నాకు తెలిసిందంతా..` అంటూ ఆది పినిశెట్టి చెప్పడంతో ప్రారంభమైన టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

Chiranjeevi birthday: 12 of his best songs that made him 'King of Dance' | Entertainment News,The Indian Express

ఈ సినిమాలో ఆది పినిశెట్టి అథ్లెట్ గా కనిపిస్తున్నాడు. నేషనల్ లెవెల్లో బంగారు పతకాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంటాడు. ఎవ‌రి స‌పోర్ట్ లేక‌పోయినా త‌న క‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. అయితే టీజర్ చివరలో ఆది ని ఒక కాలు పోగొట్టుకున్న వ్యక్తిగా చూపించి సినిమాలో ఏదో బలమైన కంటెంట్ ని చూపించబోతున్న‌ట్టు ఆస‌క్తిని రేకెత్తించారు. మొత్తానికి ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.