ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది.

Anchor Vishnu Priya (@VishnuPriya_off) | Twitter

అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలోనే ర‌మ్య‌ పెళ్లి గురించి విష్ణును ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఆమె `అఖిల్ అక్కినేని ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా.

TV host Vishnupriya wants to marry Akhil - tollywood

ఇప్పుడు ఈ మాటలు ఆయన ఫ్యాన్స్ వింటే.. నన్ను ఏసుకుంటారు.. నీ మొహానికి ఆయన అవసరమా? అని అంటారు. అయినా అయ‌న్నే పెళ్లి చేసుకుంటా. అఖిల్‌కు దేవత లాంటి భార్య రావాలి.. ఆ దేవతను నేనే కావాలి` అంటూ విష్ణు మ‌న‌సులోని మాట‌ల‌న్నీ బ‌య‌ట‌పెట్టేసింది. దాంతో ఆమె కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. కాగా, గ‌తంలోనూ అఖిల్‌పై విష్ణు ఇలాంటి కామెంట్సే చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.