హీరో కార్తీకేయ సరదా తీరిపోయిందట.. ఏ విషయంలోనంటే?

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ ఫిల్మ్‌తో స్టార్ హీరో అయిపోయాడు కార్తీకేయ గుమ్మకొండ. ఇటీవల హీరో కార్తీకేయ మ్యారేజ్ అయింది. ఇకపోతే కార్తీకేయ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్ర టైటిల్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాది కాగా, ఇందులో కార్తీకేయ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు.

ఇక టీజర్ విషయానికొస్తే.. ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కార్తీకేయ చక్కటి పర్ఫార్మెన్స్‌కు స్కోప్ కనిపిస్తుంది. టీజర్‌లో కిషోర్ కుమార్ సాంగ్ వినిపించగా, సీనియర్ నటుడు తనికెళ్లే భరణి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ సరిపల్లి డైరెక్ట్ చేయగా, రామారెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో కార్తీకేయ హీరోగానే కాకుండా కామెడీ యాంగిల్ కూడా ట్రై చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతున్నది. కార్తీకేయ హీరోగా నటించిన ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా కార్తీకేయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కార్తీకేయ కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ ‘వాలిమై’ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు.