కెసిఆర్,జగన్ లకు కేంద్రం ఝలక్ ..!

మంగళవారం (ఈరోజు) పార్లమెంటులో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు నిరాశ ఎదురైనట్లయింది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153 చేయాలని, ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానమేంటని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

దీంతో 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారమే ఈ పెంపు ఉంటుందని, ఇప్పట్లో లేదని తెలిపారు.  ఆర్టికల్ 170 ప్రకారమే ఈ నిర్ణయం ఉంటుందన్నారు.  అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఆ సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుంది.  ఈ పరిణామంతో ఇద్దరు సీఎంలు నివ్వెరపోయారు. అరె.. ఏం చేద్దాం.. అసలే అధికారంలో ఉన్న పార్టీలు.. ఆశావహులు ఎక్కువగానే ఉంటారు.. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య సరిపోదు.. వాటిని పెంచుకుంటే దాదాపు అందరికీ పదవులు ఇప్పించుకోవచ్చు.. మరికొంతకాలం అధికారంలో ఉండచ్చు అనేది వీరి ప్లాన్.. కేంద్ర ప్రభుత్వం సమాధానంతో ఆశలకు గండిపడినట్లయింది. ఇరు పార్టీల్లోని నాయకులు కూడా కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అరె.. ఎమ్మెల్యేగా మనకూ అవకాశం వచ్చేది కదా అని ద్వితీయ శ్రేణి నాయకులు భావించేవారు. ఏం చేద్దాం.. అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం.. అని సర్దిచెప్పుకుంటున్నారంతే..