మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..

August 3, 2021 at 7:02 pm

మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా కూడా వ్యవహరించి, తనకున్న ప్రతిభను అక్కడ కూడా కనబరిచాడు.

ఇక అంతే కాదు కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు , ఆక్సిజన్ రూపంలో సహాయాన్ని అందించడంమే కాకుండా సినీ కార్మికులకు కూడా తనవంతు సహాయంగా, ఆర్థిక సహాయాన్ని అందజేసి, కష్టకాలంలో వారిని ఆదుకున్న మహానేత అని చెప్పవచ్చు. ఇక ఈయన తిరిగి, రాజకీయాల నుంచి ఖైదీ నెంబర్ 150 సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. సాధారణంగా చాలా మంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం హీరోగా కొనసాగుతారు..కానీ ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోగా అడుగుపెట్టి తన క్రేజ్ ను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు.

అందుకే ఆయనతో యంగ్ హీరోయిన్లు కూడా నటించడానికి సిద్ధ పడుతున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ కూడా చిరంజీవికి చెల్లి గా నటించడానికి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు మహానటి గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్. కీర్తి సురేష్ మెగాస్టార్ నటించబోయే సరికొత్త సినిమాలో చెల్లెలి పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరంజీవి.

మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts