రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?

August 4, 2021 at 7:18 am

తమిళంలో విడుదలైన”రాక్షసన్” సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేసి, సూపర్ హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక డైరెక్టర్ పరమేశ్వర్ తో తను సొంతంగా రాసిన కథతో రాక్షసుడు -2 సినిమా ను చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈయన రవితేజ తో కలిసి “ఖిలాడి”సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో చూద్దాం.

ఇక ఈ చిత్ర నిర్మాత కోనేరు తెలిపిన విషయం ప్రకారం ఈచిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా నిర్మించబోతున్నారని, దీని కోసం ఏకంగా రూ. 100 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాని పూర్తిగా లండన్ లో షూటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తాడు లేదా అనే విషయం కూడా సందేహంగానే ఉంచారు.

కానీ ప్రస్తుతానికి రాక్షసన్ చిత్రంలో స్టార్ హీరోలు అయినటువంటి విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్ .. ఇద్దరు హీరోలతో సంప్రదింపులు జరగడం జరుగుతోందట. ఇక ఇంత పెద్ద స్టార్ హీరోల తోనే కాకుండా మరొక హీరో కూడా వస్తే పాన్ ఇండియా స్టార్ లెవల్లో సినిమా అవుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అంతే కాకుండా ఈ సినిమాకి హీరో, విలన్ వంటివారు ఎవరెవరు అనేది , త్వరలోనే వారి గురించి తెలియజేస్తామని తెలిపారు నిర్మాత. ఇక ఈ సినిమాని హీరో రవితేజ ఖిలాడి సినిమా అయిపోయిన తర్వాత నిర్మిస్తున్నట్లు తెలియజేశారు.

రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts