ఆ హీరో కోసం `రంభ‌`లా మార‌బోతున్న మోనాల్ గజ్జర్?!

August 4, 2021 at 7:32 am

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు చేసినా.. ఈ గుజ‌రాతీ భామ‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో త‌ర్వాత మోనాల్‌కు వ‌రుస సినిమా ఆఫ‌ర్లు వ‌రిస్తున్నారు.

Monal Gajjar - Wikipedia

మ‌రోవైపు టీవీ షోల‌తో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున‌ కోసం రంభ లా మార‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగార్జున న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `సోగ్గాడే చిన్నినాయన`కు ప్రీక్వెల్ గా బంగార్రాజును తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Bangarraju: Sequel to Soggade Chinni Nayana to go on floors in June? | Telugu Movie News - Times of India

అయితే ఈ చిత్రంలో మోనాల్ ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ట‌. బంగార్రాజు సినిమాలో సుదీర్ఘమైన స్వ‌ర్గం ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో మోనాల్ రంభ‌గా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, నాగ్‌కు, ఆమెకు మ‌ధ్య ఆ అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దేవ‌లోక రంభగా మోనాల్ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

ఆ హీరో కోసం `రంభ‌`లా మార‌బోతున్న మోనాల్ గజ్జర్?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts