షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘ‌నిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియ‌న్ డాల‌ర్ల‌ను అమెరికా ఫ్రీజ్ చేసేసింది.

అంతేకాకుండా ఇప్పటివరకు 3200 మందిని కాబూల్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించామని వైట్‌హౌస్‌ ప్రకటించింది.అందులో 1100 అమెరికా నివాసితులు ఉన్నారని తెలిపింది. వాళ్ల అందరిని మంగళవారం రోజునే ప్రత్యేక విమానాల్లో అమెరికాకు తరలించారు. మిగ‌తా 2 వేల మంది ఆఫ్ఘనిస్థాన్‌ దేశస్థులు అని తెలిపింది. ఇంకా చాలా మంది
ఆఫ్ఘనిస్థాన్‌ దేశాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లాలని భావించేవారు చాలా మందినే ఉన్నారని తెలుస్తుంది.