అంగన్‌వాడీ టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…?

ప్రతిపక్ష టీడీపీ ఎంతలా విమర్శలు చేసినా ఏపీ సర్కారు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే అనేక వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు.. తాజాగా అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హతలను బట్టి అంగన్ వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే కాకుండా అదనంగా ఏపీలో దాదాపు 14 వేల కొత్త పాఠశాలలు ఏర్పాటవుతాయని సర్కారు చెబుతోంది.

 

ఇకపై పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా కొత్త విద్యావిధానానికి, నాడు–నేడు కార్యక్రమానికి దాదాపు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా విద్యా కానుక పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 16 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పథకాలపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవట్లేదు.