ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెర‌పై బోల్తా పడిన `వ‌కీల్ సాబ్‌`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ అద‌గొట్టింది.

కానీ, బుల్లితెర‌పై మాత్రం బోల్తాప‌డ‌టంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమా ఫ‌స్ట్ టైమ్ ఈ నెల 18న జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కాగా.. దీనికి సంబంధించిన టీ ఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. దాని ప్ర‌కారం.. ఈ చిత్రానికి 19. 12 రేటింగ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇది రికార్డ్ రేటింగ్ అయిన‌ప్ప‌టికీ.. ఇత‌ర సినిమా రికార్డుల‌ను బ్రేక్ చేయ‌లేక‌పోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు టీవీలో తొలిసారి ప్రసార‌మై టాప్ టీఆర్పీ రేటింట్స్ సంపాదించిన సినిమాల విష‌యానికి వ‌స్తే.. అల వైకుంఠపురములో- 29.4, సరిలేరు నీకెవ్వరు- 23.4, బాహుబలి 2- 22.7, శ్రీమంతుడు- 22.54, డిజె- 21.7, బాహుబలి- 21.54, ఫిదా- 21.31, గీతా గోవిందం- 20.8, జనతా గ్యారేజ్- 20.69 మహానతి- 20.21 రేటింగ్స్ సాధించాయి. ఈ లెక్క‌న చూస్తే వ‌కీల్ సాబ్ రేటింగ్ చాలా త‌క్కువ‌ని చెప్పాలి.