రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ కొనసాగింపుగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్ అధీరాగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే ఈ రోజు సంజయ్ దత్ బర్త్‌డే. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్రకు సంబంధించి న్యూ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చేతిలో భారీ ఖడ్గం పట్టుకొని, వెనక సైన్యంతో పవర్‌ఫుల్‌గా నడిచొస్తూ సంజయ్ దత్ కనిపిస్తోంది.
మొత్తానికి అదిరిపోయిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఒకే సారి గ్రాండ్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.