`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం ఓటీటీలో విడుద‌లై అక్క‌డ కూడా హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఐఎమ్‌డీబీ రేటింగ్స్‌లో వకీల్ సాబ్ కొత్త రికార్డు సృష్టించింది.

ఒరిజినల్ మూవీ పింక్‌కు 75.5 పర్సెంట్ రేటింగ్ రాగా… మన వకీల్ సాబ్‌ మాత్రం 84.4 పర్సెంట్‌తో టాప్‌లో నిలిచింది. ఇక పింక్ త‌మిళ రీమేక్ నేర్కొండ పార్వై 73.4 పర్సెంట్ రేంటిగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ప‌వన్ రీ ఎంట్రీ చిత్రం కావ‌డం, అలాగే ఒరిజినల్ వర్షన్‌లో లేని మాస్ కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేయటం వకీల్‌ సాబ్‌కు బాగా కలిసొచ్చిన అంశాలు.