అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే మరింత వేగంగా సెకెండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు.
ఇక ఈ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు పలువురు ప్రముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సినీ కార్మికులు, ప్రజలకు ఇప్పటికే అనేక సేవలు అందించిన చిరు.. తాజాగా సినీ కార్మికులకు గుడ్‌న్యూస్ అందించారు. సినిమా కార్మికులకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు చిరంజీవి నేతృత్వంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమం సోమవారం పునః ప్రారంభమైంది.
ఆ సారి రోజుకు ఏకంగా ఐదారు వందలమందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ వారికి, ఫిలిం ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్ట్‌లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.