ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో యాక్ష‌న్ సీన్స్‌కు సంబంధించిన షూట్ జ‌రుగుతుండ‌గా, ప‌తాక స‌న్నివేశాల‌లో భీకర పోరాటం కోసం అమెరికా నుండి 40 మంది యోధులు ఇండియాకి వ‌స్తున్నారు. 40 మందితో జ‌క్క‌న్న చిత్రీక‌రించే క్లైమాక్స్ సీన్ ప్రేక్ష‌కుల స‌రికొత్త వినోదాన్ని పంచుతుంద‌ని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 1947 స్వాతంత్య్రానికి పూర్వం జరిగే హిస్టారికల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా రచయిత వి విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సినిమా కోసం పెద్దగా చెప్పుకున్నా ఫైట్ సీక్వెన్స్ లు మాత్రం అద్భుతంగా ఉంటాయన్నారు. ప్రతీ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా మరో స్థాయిలో ఉండడమే కాకుండా చాలా భావోద్వేగపూరితంగా ఉంటాయని తెలిపారు. అలాగే ఒక్కో ఫైట్ కూడా చాలా విభిన్నంగా అనిపిస్తాయని ఆయన వెల్లడించారు. మరి ఆ ఫైట్స్ చూడాలంటే అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.