ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ కొత్త రికార్డు!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూరి అయిన వెంట‌నే.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌టన కూడా వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే మ‌హేష్ బాబుకు ఫాలోవ‌ర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ట్విట్ట‌ర్ లో మ‌హేష్‌ను కోటీ 14 ల‌క్ష‌ల మందిని ఫాలో అవుతుండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫీట్‌ని మ‌రే టాలీవుడ్ హీరో బ్రేక్ చేయ‌లేక‌పోయారు.

ఇక తాజాగా ట్విట్ట‌ర్ లో ఓ కొత్త రికార్డు సృష్టించారు మ‌హేష్‌. మ‌హేష్ చేసిన ట్వీట్స్‌కి 100 కె లైక్స్ 24 సార్లు వ‌చ్చాయి. దీంతో అత్య‌ధిక సార్లు 100 కె లైక్స్ పొందిన హీరోగా మ‌హేష్‌ అగ్ర‌స్థానం నిలిచారు. ఇక ఆ త‌ర్వాత స్థానంల్లో ఎన్టీఆర్(6), రానా దగ్గుబాటి(3) ఉన్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(2), అల్లు అర్జున్ (2), రామ్ చరణ్, నాని ఒక్కసారి మాత్రమే 100 కె లైక్స్ సాధించారు.