`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్‌?

May 23, 2021 at 9:45 am

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విజ‌యం ఏంటంటే.. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడుగా యంగ్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్‌ను రంగంలోకి దింపుతున్నాడ‌ట కొర‌టాల‌.

ప్రస్తుతం కోలీవుడ్‌ ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హవా కొన‌సాగుతోంది. బడా హీరోలతో భారీ సినిమాలకు సంగీతం అందిస్తూ సూప‌ర్‌ క్రేజ్ సొంతం చేసుకున్న అనిరుధ్..తెలుగులోనూ ప‌లు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఇక ఇప్పుడు ఈయ‌న చేతిలో ఎన్టీఆర్ 30 సినిమా కూడా ప‌డిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన రావాల్సిందే.

`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts