కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!

ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు.

ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను ఉంచి మ్యాచ్లు ఆడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ముందు ముందు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంతో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా వేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఇక పరిస్థితి సద్దుమణిగిన తరువాత మిగతా షెడ్యూల్ ను కొనసాగించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.