జూ పార్క్ లో కరోనా కలకలం..?

కరోనా వైర‌స్ రెండోవేవ్ రోజు రోజుకు తీవ్ర రొఊపం దాలుస్తుంది. రోజు రోజుకు మ‌న‌షుల్లోనే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణాంతకమయిన కరోనా వైర‌స్ తాజాగా జంతువులో కూడా వ్యాపించింది. అమెరికాలో క‌రో్నా మొద‌టి ద‌శ‌లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పులికి సోకినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కరోనా మ‌హమ్మ‌రి మొదటి సారిగా ఏకంగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘ‌ట‌న నమోదు అయింది.

అసలు వివ‌రాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు గుర్తించిన జూ అధికారులు వెంటనే వాటిని నమూనాలను పరీక్షల కోసం సీసీఎంబీకి పంపించారు. సెకండ్ వేవ్‌లో ఇప్పుడు జంతువులకు కూడా కరోనా సోకె అవకాశం ఉన్నట్లు వారు అన్నారు. అయితే కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర పర్యావరణశాఖ ఆదేశాలతో పార్కులు అన్ని క్లోజ్ చేశారు. ఆదివారం నుండి ఇకమీదట జూ పార్క్‌లో సందర్శకులకు అనుమతి లేదని వారు అన్నారు.