ప్రారంభ‌మైన‌ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్‌..ఎక్క‌డెక్క‌డంటే?

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్క‌డిక్క‌డ క‌రోనా కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో ఎంద‌రో ప్ర‌జ‌లు ప్రాణాలు క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్పిన‌ట్టుగానే ఈ రోజు చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్ లాంచ్ కాగా.. నేటి ఉదయం 10.30 నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లా కేంద్రాలలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్స్ సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి.

అలాగే రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో ఐదు జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్ ప‌నుల‌న్నీ చిరంజీవి త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు.

https://twitter.com/KChiruTweets/status/1397404248158085125?s=20