మ‌రో న‌యా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

అయితే ఇప్ప‌టికే హీరోల‌ను ప‌రిచ‌యం చేస్తూ భీమ్ ఫ‌ర్ రామ‌రాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జ‌క్క‌న్న‌ టీజ‌ర్లు విడుద‌ట చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా రామరాజు ఫర్ భీమ్ టీజ‌ర్‌తో ఎన్నో రికార్డులు నెల‌కొల్పిన ఎన్టీఆర్‌.. తాజాగా మ‌రో న‌యా రికార్డ్‌ను సెట్ చేశాడు.

ఇప్ప‌టికే ఈ టీజర్ మ‌న‌ టాలీవుడ్ హిస్టరీ లోనే ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజ‌ర్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. దీంతో యాబై మిలియన్ వ్యూస్ దాటిన మొట్ట మొద‌టి టీజ‌ర్‌గా రామరాజు ఫర్ భీమ్ నిలిచింది. మ‌రోవైపు ఈ టీజ‌ర్‌కు 14 మిలియ‌న్ల కామెంట్స్ వ‌చ్చాయి. ఇదీ ఓ రికార్డే అని చెప్పాలి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.